ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ కేసుల పెరుగుదలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతున్నాయి.
ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,515 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788కి పెరిగింది.
తాజా కేసులతో పాటు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. వీరిలో 19,80,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 కేసులు యాక్టివ్‌గా వున్నాయి. గత 24 గంటల్లో 68,865 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.
ఇదిలావుంటే, భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదేసమయంలో 496 మంది కరోనాతో మృతి చెందారు. 32,988 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. 3,18,21,428 మంది కోలుకోగా, ఇంకా 3,44,899 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,36,861కి పెరిగింది.
కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేరళలో తాజాగా 30,007 పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదైనట్టు తెలిపింది.