Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో అన్ని సామాజిక వ‌ర్గాలకు ప్రాధ్యానం

విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో అన్ని సామాజిక వ‌ర్గాలకు ప్రాధ్యానం
విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (18:14 IST)
న‌గ‌ర పాలక సంస్థ కౌన్సిల్ లో మంచి నిర్ణ‌యాలు తీసుకుని విజ‌య‌వాడ‌ను అభివృద్ది దిశ‌గా తీసుకువెళ్లేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, అందులో భాగంగా బీసీల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చామ‌ని  దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

శ‌నివారం న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశంలో ఐదుగురు స‌భ్యుల‌ను విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ  కో-ఆప్టెడ్ స‌భ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీక‌రిమునిసా, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఐదుగురు న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యులను అభినందించి, స‌న్మానించారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ,  అన్ని సామాజిక వ‌ర్గాల వారికి న్యాయం చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని,  అందులో భాగంగా ఐదుగురి న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యులుగా ఎన్నికోవ‌డం జ‌రిగింద‌న్నారు. మైనార్టీల‌కు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అధిక ప్రాదాన్యం ఇస్తోంద‌ని, అంద‌రినీ క‌లుపుకుని విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి కృషి చేస్తామ‌న్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎల‌క్ష‌న్ అధార్టీ, క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేష‌న్ వారి స‌ర్క్యుల‌ర్ ప్రకారం ర్యాజంగ బ‌ద్దంగా నామినేష‌న్ ప‌ద్ద‌తిలోనే ఐదుగురి స‌భ్యుల‌ను న‌గ‌ర పాల‌క సంస్థ కో-అప్టు స‌భ్యుల ఎన్నిక జ‌రిగింద‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. న‌గ‌రంలోని 64 మందితో క‌లిపి ఈ 5 గురు స‌భ్యులు కూడా న‌గ‌రాభివృద్దికి కృషి చేయాల‌న్నారు.
 
Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.300 కోట్లతో రష్యాతో డీల్.. 70వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కోసం,..?