Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త‌ల్లి, పిల్ల‌ల‌ను ర‌క్షించారు... శభాష్ పోలీస్!

Advertiesment
child rescue
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:41 IST)
ఆ కన్నతల్లి కి ఎంత కష్టం వచ్చిందో... ముక్కుపచ్చలారని ఇద్దరు పసికందుల తో సహా చనిపోవాలని నిర్ణయించుకుంది. విజయవాడకు చెందిన రుద్ర వరపు శాంతిప్రియ తన ఇద్దరు పిల్లలతో సహా బకింగ్ హోమ్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
అప్పుడే విధుల కి వెళుతున్న కృష్ణానది చెక్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు  వీళ్ళ  ఆత్మహత్య ప్రయత్నం గమనించాడు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ఎంతో సాహసోపేతంగా వారి ప్రాణాల్ని ర‌క్షించాడు. 20 మంది యువకుల సహాయంతో ఆ పోలీస్ ముగ్గురు ప్రాణాలు రక్షించాడు... ఆయ‌నే హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు....ఇపుడు అత‌న్ని శెభాష్ పోలీస్ అంటున్నారు స్థానికులు.
 
తల్లి పిల్లలతో సహా ప్రాణాలతో ముగ్గురు దక్కడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రుద్ర రపు  శాంతి ప్రియ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తల్లి పిల్లల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు.  ఆత్మహత్య ప్రయత్నానికి కుటుంబ కలహాలే కారణమని, పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు చెప్పాడు. బకింగ్ హోమ్ కెనాల్ నుంచి ముగ్గురుని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు కి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితురాలి కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఈ ఆత్మహత్య ప్రయత్నంపై తాడేపల్లి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జ‌న‌సేన కొత్త ఉద్య‌మం ... రోడ్ల‌పై వీడియోల ప్ర‌ద‌ర్శ‌న‌!