Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణం జరిగింది. ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. అదీకూడా నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ యువతిని రెండు రోజుల పాటు బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని పాయకాపురం వాంబే  కాలనీకిచెందిన శ్రీకాంత్ (26) అనే వ్యక్తి ప్రభుత్వం ఆస్పత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈయన ఇంటికి సమీపంలో 23 యేళ్ళ  యువతితో పరిచయమైంది. ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని, పైగా, తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆ యువతి శ్రీకాంత్‌ను నమ్మింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంట్లోనుంచి శ్రీకాంత్‌తో కలిసి పారిపోయింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో సరకులు భద్రపరుచుకునే చిన్న గదిలో బంధించాడు. అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడు తన స్నేహితుడైన జె.పవన్‌ కళ్యాణ్‌ను ఆస్పత్రికి రప్పించి, ఆ తర్వాత ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు.
 
మరోవైపు, తమ కుమార్తె కనిపించకపోవడతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి, శ్రీకాంత్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం