కంట్రోల్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:43 IST)
నీట మునిగిన విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మంగళవారం సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆయన కోరారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. 
 
విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు పార్టీ శ్రేణులు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే, విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. మరోవైపు, ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులుగా ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments