Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం.. ఏపీకి వైజయంతి మూవీస్ రూ.25 లక్షలు

Advertiesment
jrntr

ఠాగూర్

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతుగా తలా రూ.50 లక్షల మేరకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. 
 
కాగా, గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది. దాదాపు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురైయ్యాయి. విజయవాడ నగరంతో పాటు ఆనేక గ్రామాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులైయ్యారు. వేలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. 
 
ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వంతుగా ముందుకు వచ్చి విరాళాలు ప్రభుత్వానికి అందిస్తున్నాయి. ఈ క్రమంలో 'ఆయ్' చిత్ర బృందం వరద బాధితులకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు సోమవారం నుండి వారాంతం వరకూ 'ఆయ్' సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
 
ఇదేక్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత అని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అద్భుతమైన ఫీచర్లు...