Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఈవో రవిప్రకాశ్‌పై విజయసాయిరెడ్డి ఫైర్.. ఎన్నాళ్లు మోసం చేస్తారు..?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (15:34 IST)
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. 'మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం మూడు గంటల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట.


సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళితే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబై చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?' అని ట్వీట్ చేశారు.
 
ప్రస్తుతం ఆయన కోసం ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఒకవేళ అమరావతిలో దాక్కుంటే ఈ నెల 23 తర్వాత దొరికిపోతామన్న ఉద్దేశంతో కర్ణాటక మీదుగా ముంబై చేరుకున్నట్లు తనకు తెలసిందన్నారు. తనను ఎవరూ టచ్ చేయలేరని బీరాలు పలికిన ఆయన ప్రస్తుతం పరారీలో ఎందుకు ఉన్నారని అడిగారు. 
 
అలాగే తీవ్రమైన కరవుతో అనంతపురంలో మరణ మృదంగం మోగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరవు కారణంగా వేలాది కుటుంబాలు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలస పోతున్నాయన్నారు. 
 
చివరికి పశువులు, గొర్రెలకు మేత కూడా దొరక్కపోవడంతో వాటిని సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఇలాంటి పరిస్థితులు ఉంటే మరోవైపు రెయిన్ గన్లు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం అని ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments