Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా వల్లే ప్రజారాజ్యం కొంప మునిగిపోయింది.. నాగబాబు

Webdunia
ఆదివారం, 12 మే 2019 (14:53 IST)
మీడియా, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మీడియా ఒక్కటే ప్రపంచంలో జరుగుతుందనేది ప్రజలకు ఇట్టే తెలియజేస్తుంది. మీడియా మంచి విషయాలను ప్రజలకు చేరవేస్తున్నాయి. కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయనే వాదన వుంది. తాజాగా మీడియాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. 
 
అస‌లే ఇప్పుడు టీవీ 9 ర‌విప్ర‌కాశ్ ఇష్యూతో మీడియాపై ప్ర‌జ‌ల్లో కూడా మంచి చ‌ర్చ జ‌రుగుతుంది. ఇలాంటి స‌మ‌యంలో నాగ‌బాబు కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం.. దుర్మార్గం ఇంకెవ‌రూ చేయ‌లేద‌ని చెప్పాడు. 
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు చిరంజీవి రేంజ్ వేరు.. కానీ పార్టీ పెట్టిన త‌ర్వాత ఆయ‌న ప‌రిస్థితికి కార‌ణం మీడియా అని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నాగ‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు.

అప్ప‌ట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండింటికి వ‌త్తాసు ప‌లికే ఛానెల్స్ ఉండ‌టం.. కావాల‌నే చిరంజీవిపై దుర్మార్గం చేయ‌డంతోనే ఆయ‌న‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని నాగబాబు తెలిపాడు. గ‌తంలో కూడా చిరుకు మీడియా స‌పోర్ట్ లేదు కాబ‌ట్టే రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌ని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments