Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సరిహద్దులలో 7 గంటల వరకే వాహనాల అనుమతి

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:18 IST)
నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులు ఇకపై ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాల అనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్లగొండ నుండి ఏ.పి.లోకి వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7 తర్వాత ఆంధ్రా సరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారని అందువల్ల ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణించాలని రంగనాధ్ కోరారు.

7 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
 
పాస్ ఉంటేనే ఏ.పి.లోకి అనుమతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని వారు అనుమతించడం లేదని అందువల్ల ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధిత అధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments