Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ నేతలు చర్చలు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (19:28 IST)
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు టిడిపి నుంచి వైసిపిలోకి వెళ్ళే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉన్నదే 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు. అందులో ఇప్పటికే వల్లభనేని వంశీ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వైసిపితో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
 
దీంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు బిజెపితో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం బాగానే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిల వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే టిడిపి పార్టీ ఘోరంగా విఫలమవ్వడానికి నారా లోకేష్ కారణమంటూ వల్లభనేని వంశీనే స్పష్టం చేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసినప్పుడు వీరు సంతోష పడ్డారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు స్క్రిప్ట్ కూడా అందించారు.
 
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారట వల్లభనేని. ఆయన్ను తిరిగి రాజకీయాల్లోకి రావాలని వల్లభనేని ఫోన్ ద్వారా జూనియర్‌తో మాట్లాడారట. ప్రస్తుతం అవసరపడి రాజకీయాల్లోకి రాకూడదని.. సినిమాల్లో బిజీగా ఉన్నాను తప్ప రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడనని వంశీకి సున్నితంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments