Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్‌ను బాగా వాడుకుని వదిలేసింది మీ ఇద్దరే, ఎవరు?

Advertiesment
Vallabhaneni Vamsi
, బుధవారం, 20 నవంబరు 2019 (22:02 IST)
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారడం ఒక ఎత్తయితే ఆయన మారిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో మరింత దుమారాన్ని సృష్టిస్తున్నాయి. పార్టీల గోల ఎలాగున్నా మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ విపరీతంగా జరుగుతోంది. జూ.ఎన్టీఆర్ ను ఎన్నికల్లో వాడుకుని చంద్రబాబు నాయుడు వదిలేశారంటూ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అసలు తమ అధినేత కంటే జూనియర్ ఎన్టీఆర్ ను ఎక్కువగా వాడుకుని వదిలేసింది వల్లభనేని వంశీ, కొడాలి నాని అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ ను ఎవరూ పార్టీ నుంచి వెళ్లమనలేదనీ, అసలు ఆయనే చాలా సందర్భాల్లో తన తాత పెట్టిన పార్టీలో వుండమనడానికి వెళ్లమనడానికి ఎవరూ లేరని చెప్పిన విషయం గుర్తులేదా అంటూ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్ కంపు కొడుతోంది"