ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:54 IST)
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) పరీక్షల్లో తెలుగు యువకులు సత్తా చాటారు. బాపట్లకు చెందిన వెంకట శ్రీకాంత్ జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచాడు. అలాగే, అన్నమయ్య జిల్లా పెద్ద మండ్యం మండలానికి చెందిన నారా భువనేశ్వర్ 31వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. తనకు పర్యావరణ సంబంధమైన విషయాలపై ఆసక్తి ఎక్కువని, అందుకే ఈ విభాగాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. కాలుష్య నివారణ, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులపై పరిశోధన తదితర అంశాలతో పాటు అడవులను కాపాడటానికి కృషి చేస్తానని చెప్పారు. 
 
అయితే, తనకు తొలి ర్యాంకు వస్తుందని ఊహించలేదని, చాలా ఆనందంగా ఉందన్నారు. మొదటి ర్యాంకు వచ్చింది కనుక ఆంధ్ర కేడర్ ఎంచుకునే అవకాశం ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. కాగా, భువనేశ్వర్ గతేడాది మొదటిసారిగా ఐఎఫ్‌ఎస్ పరీక్షలు రాయగా అర్హత సాధించలేదు. అనంతరం పట్టుదలతో మళ్లీ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments