Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి రావాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. విభజన చట్టం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. 
 
ఏపీ పునర్వభజన చట్టంలో పేర్కొన్న అశాలు, వాటి అమలు, ఇంకా అమలుకు నోచుకోని అంశాల అమలు తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని ఇంకా అమ‌లు కాని అంశాల‌పై చ‌ర్చ‌కు కేంద్ర హోం శాఖ సిద్ధ‌మైంది. 
 
ఈ దిశ‌గా ఈ నెల 27న ఇరు రాష్ట్రాల‌తో స‌మావేశం కావాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు స‌మావేశానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న ఇరు రాష్ట్రాల సీఎస్‌ల‌కు లేఖ‌లు రాశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌పైనే ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments