Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకిన రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి (2) అనే చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో గత నెలలో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం ఆమె చనిపోయింది. 
 
అయితే, ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు శాంపిల్స్‌న పూణెలోని వైరాలజీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఆస్పత్రికి చేరింది. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి అనేక కోళ్లు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments