Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

Advertiesment
Bird flu

ఐవీఆర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:29 IST)
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి.
 
ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు. కోళ్ల మృతితో తనకు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందనీ, ప్రస్తుతం తన వద్ద వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని రైతు వాపోతున్నాడు. మరోవైపు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోడి మాంసం అమ్ముతున్నవారు ఎవరైనా వుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులపై తనిఖీలు చేస్తామన పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైట యూట్యూబ్ ఛానల్ బోర్డ్, లోపల 10 మంది మహిళలతో స్పా మసాజ్ (video)