మరో రెండేళ్లు స్థానికత గడువు పెంపు

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:02 IST)
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీ తరలివచ్చే వారి స్థానికత విషయంలో ఇప్పటి వరకూ ఉన్న ఐదేళ్ల గడవును మరో రెండేళ్లు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కానందున ఏపీ విజ్ఞప్తి మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2 లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వచ్చే వారికి స్థానికత కల్పిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును మరో ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 2014 జూన్‌ 2 నుంచి ఏడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి వీలుంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయిన తర్వాతా ఇప్పటికీ వివిధ పోలీసు కేడర్‌తోపాటు, షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన అంశం కొలిక్కిరాకపోవడం వలన ఏపీకు చెందిన చాలామంది తెలంగాణలో ఉంటున్నారు.

ఈ సమస్య పరిష్కరించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మరో రెండేళ్లపాటు గడువు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రహోంశాఖ మన్నించి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలి ఉత్తర్వుల ప్రకారం 2017 జూన్‌ 2వరకూ గడువు విధించారు. తర్వాత రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో 2019 జూన్‌ వరకు పొడిగించారు.

తాజాగా మరో రెండేళ్లు పెంచారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్‌ 2లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి తరలివచ్చి ఏ ప్రాంతంలో స్థిరపడితే ఆ స్థానికతను కల్పించి విద్యా, ఉద్యోగావకాశాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments