Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పోస్టింగులతో సంబంధం లేదు: చెవిరెడ్డి

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:00 IST)
జగన్, చిరంజీవిల మధ్య సఖ్యత నెలకొనకుండా వుండేందుకు పోస్టింగులు పెట్టించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఆ పోస్టింగులతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు.
 
"మెగాస్టార్‌ చిరంజీవిగారిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పోస్టింగులకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు. నాకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవు. నేను తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్నరోజుల్లో చిరంజీవిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు.

అప్పటినుంచి ఆయనతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారికీ, చిరంజీవిగారికీ మధ్య  సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశంపార్టీయే ఈ దుష్ప్రచారానికి పూనుకుంది. నాకు అభిమాన సంఘాలు అంటూ లేవు. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. జగన్‌గారికి మాత్రమే ఉంటాయి.

నేనూ జగనన్న అభిమానినే. నా అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను" అని తన ప్రకటనలో చెవిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments