Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు- ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2)

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:25 IST)
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2) దోషులుగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 
 
అనీక్‌ షఫీక్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరికి శిక్షలపై సోమవారం తీర్పు ప్రకటించనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌, సాధిక్‌ ఇసార్‌, అంజుమ్‌లను నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.
 
కాగా, 2007 ఆగస్టు 25న నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 42 మంది మృతిచెందగా 70 మందికి పైగా గాయాల పాలైయ్యారు. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది. 
 
రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ సహా పలువురిని నిందితులుగా చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో అరెస్టైన వారిలో ఐదుగురు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆగస్టు 27వ తేదీన తుది విచారణ జరిపిన కోర్టు, సెప్టెంబర్ నాలుగో తేదీన (మంగళవారం) తుది తీర్పు వెలువరించింది. 
 
ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments