Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మీద కోపంతో బిడ్డను చంపిన తల్లి...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (16:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జిరగింది. భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కానీ, ఇటుక కొట్టిన దెబ్బలు తాళలేక ఇద్దరు పిల్లలు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు రావడంతో ఆ తల్లి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లాలోని దావరిఖని, సప్తగిరి కాలనీలో రమాదేవి అనే మహిళ భర్తతో కలిసి నివశిస్తోంది. వీరికి  అజయ్, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మాత్రం ఎన్టీపీసీలో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త విధులకు వెళ్లాడు. అయితే, భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
 
దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments