Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేనీళ్ళల్లో ఎండుద్రాక్షలు నానబెట్టి తింటే..?

వేనీళ్ళల్లో ఎండుద్రాక్షలు నానబెట్టి తింటే..?
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:47 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండడం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
 
ఎండుద్రాక్షల్లోని ధాతువులు, పీచు వంటివి శరీరానికి పోషక విలువలు అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాట ప్రతిరోజూ రాత్రి రెండు ఎండుద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే పదార్థాలు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుండి ఉపశమనం కలుగుతుంది. 
 
ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళల్లో నానబెట్టి ఆ తరువాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి చెందుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివలన పండ్లలోని రసం వీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు పెరగడానికి.. పెళ్ళికేమైన లింక్ ఉందా..?