Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (13:36 IST)
తిరుమల శ్రీవారి అర్జిత సేవలను జనవరి నెలలో నిర్వహించుకోవాలని వేచి చూస్తున్న భక్తులకు తితిదే శుభవార్త చెప్పింది. సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 20వ తేదీ వరకు 9.59 గంటల వరకు ఈ ఆర్జిత సేవాల కోసం తమ పేర్లను ఆధార్ నంబరు సాయంతో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ దేవస్థానమ్స్ యాప్ నుంచి కానీ, తితిదే అధికారిక బుకింగ్ పోర్టల్ నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు. 
 
లక్కీ‌డీప్‌‍లో ఎంపికైన భక్తులకు 20వ తేదీ సమాచారం వస్తుంది. ఎంపికైన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫీజులు చెల్లించాల్సి తమ ఆర్జిత సేవలను ఖరారు చేసుకోవాలి. ఇక జనవరి నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవల కోసం ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 
 
జనవరి నెలలో అంగప్రదక్షిణ కోటా టోకెన్‌లను ఈ నెల 23వ తేదీ ఉదయం 20 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక జనవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు కోటా దర్శన టిక్కెట్లను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. తిరుమల, తిరుపతి అకామిడేషన్ బుకింగ్ ఈ నెల 25 లేదా 26 తేదీల్లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments