తిరుమలలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:00 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. గతంలో కరోనా వైరస్ కారణంగా.. భక్తులను అనుమతించలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తక్కువ కావడంతో భక్తులను అనుమతినిస్తున్నారు. అయితే.. కొన్ని నిబంధనల మధ్య భక్తులను శ్రీ వారి దర్శనానికి అనుమతినిస్తున్నారు.
 
మరోవైపు.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున టీటీడీ విడుదల చేయనుంది.
 
వైద్య పరీక్షలు నిర్వహించాకే దర్శనానికి అనుమతినిస్తారు. మాస్క్ ధరించాలి..భౌతిక దూరం తప్పనిసరి. కంటైన్ మెంట్ జోన్ల భక్తులకు, 65 ఏళ్లు పైబడిన వారికి.. పిల్లలకు అనుమతినివ్వరు. రెండు గంటలకొకసారి క్యూ లైన్లలో శానిటైజేషన్ నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు వుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments