Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. శ్రీవారి హుండీకి అంత ఆదాయమా? నెలల వారీగా...

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (10:34 IST)
గత యేడాది తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అలాగే, గత యేడాది కాలంలో ఏకంగా 2.54 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల ఆదాయం రాగా, 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
మార్చి నెలలో 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా ఉంది. ఏప్రిల్ నెలలో 20.95 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.114.12 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలలో 23.38 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.109.99 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెలలో 23 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.116.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. జూలై నెలలో 129.08 కోట్లు, ఆగస్టు నెలలో రూ.120.05 కోట్లు, సెప్టెంబరు నెలలో రూ.111.65 కోట్లు, అక్టోబరు నెలలో రూ.108.65 కోట్లు, నవంబరు నెలలో రూ.108.46 కోట్లు, డిసెంబరు నెలలో రూ.116.07 కోట్ల మేరకు హుండీ ఆదాయం వచ్చినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
గత యేడాది జనవరి మూడో తేదీన వైకుంఠ ఏకాదరి సందర్భంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.7.68 కోట్లు లభించగా, ఇటీవల వైకుంఠ ఏకాదశి రోజున రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, కోవిడ్ మహమ్మారి తర్వాత 2022 మార్చి నెల నుంచి ప్రత్యేక దర్శనాలతో పాటు టోకెన్ రహిత దర్శనాలు, ఆర్జిత సేవలన్నీ ప్రారంభమైన క్రమంలో హుండీ ఆదాయం ప్రతి నెల రూ.100 కోట్లు దాటుతూ వస్తుంది. 2022 మార్చి నుంచి డిసెంబరు వరకు రూ.1291.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments