Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు వివిధ రకాలైన శ్రీవారి టిక్కెట్లు విడుదల

Advertiesment
TTD
, శుక్రవారం, 10 నవంబరు 2023 (08:23 IST)
ttd temple
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు శ్రీవారి సేవలకు సంబంధించిన వివిధ రకాలైన టిక్కెట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తిరుమల ఏకాదశి ద్వార దర్శకన టిక్కెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వసతి గదుల కేటాయింపు తదితర టిక్కెట్లను తితిదే విడుదల చేయనుంది. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తారు. ఇందులో 2.25 లక్షల ప్రత్యేక దర్శన టిక్కెట్లను అందుబాటులో ఉంచనుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ట్రస్టు దర్శన టిక్కెట్లను విడుదల చేస్తారు. రోజుకు 2 వేల చొప్పు ఈ టిక్కెట్లను పది రోజులకు గాను 20 వేల టిక్కెట్లను విడుదల చేయాలని తితిదే అధికారులు నిర్ణయించారు. 
 
అలాగే, వసతి గదుల కోటాను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తిస్తాయి. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

తిరుపతి మహిళా టెక్కీని వేధించిన తిరుచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు.. ఎక్కడ?  
 
బస్సులో తన పక్క సీటులో కూర్చొన్న తిరుపతికి చెందిన 35 యేళ్ల మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించిన కేసులో తిరుచ్చికి చెందిన రంగనాథ్ (50) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత సోమవారం ఫ్రాంక్‌ఫ్రట్ నుంచి బెంగుళూకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తుండగా, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన రంగనాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన సీటు పక్కనే కూర్చొన్న తిరుపతికి చెందిన మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించాడు. 
 
నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్టు గుర్తించి ఆమె మేల్కొని విమాన స్బిబంది దృష్టికి తీసుకెళ్లింది. విమానం కెంపేగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... రంగనాథ్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.25,000 లతో కొత్త టాటా హారియర్, సఫారీ కోసం బుకింగ్‌లు ప్రారంభం