Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.25,000 లతో కొత్త టాటా హారియర్, సఫారీ కోసం బుకింగ్‌లు ప్రారంభం

Advertiesment
Tata Harrier and Safari
, గురువారం, 9 నవంబరు 2023 (23:43 IST)
అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త హారియర్, సఫారీ మోడళ్ల కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు భారతదేశపు ప్రముఖ ఆటోమోటివ్ తయారీసంస్థ టాటా మోటార్స్ ఈరోజు ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికత, సాటిలేని భద్రతా ఫీచర్లు, వినూత్నత, శ్రేష్ఠత పట్ల టాటా మోటార్స్ అంకిత భావాన్ని ఉదహరించే డిజైన్ విలువలని ఏకీకృతం చేయడం ద్వారా మునుపటి మోడల్స్ సాధించిన అసాధారణ విజయాన్ని అనుసరించి, కొత్త హారియర్, సఫారీలు డ్రైవింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు నుండి కస్టమర్లు తాము ఎంపిక చేసుకున్న ట్విన్ ఎస్ యూవీని అన్ని అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో కేవలం రూ.25,000లతో బుక్ చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, ‘‘ఈరోజు నుండి కొత్త హ్యారియర్, సఫారీ బుకింగ్‌లను ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. మా కస్టమర్‌ల విలువైన ఫీడ్‌బ్యాక్‌తో మార్గనిర్దేశం చేయబడిన శ్రేష్ఠత పట్ల మా నిబద్ధత, ఈ లెజెండ్‌ల ఆధిపత్యం యొక్క కొత్త శకానికి నాంది పలికింది. సామర్థ్యం గల OMEGARCతో నిర్మించబడిన ఈ ఎస్ యూవీలు తమ అత్యుత్తమ డిజైన్, అధునాతన ఫీచర్‌లు, ప్రీమియం ఇంటీరియర్స్, బలమైన పవర్‌ ట్రెయిన్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని విధాలుగా తమను తాము మెరుగ్గా మార్చుకోవడానికి మాత్రమే అవి పునర్నిర్మించబడ్డాయి. టాటా మోటార్స్ ఎస్‌యూవీల కొత్త తరంగాలను మీకు అందించడానికి మేం సంతోషిస్తున్నాం. ఈ రెండు ఉత్పాదనలు మా కస్టమర్‌ల సామర్థ్యాన్ని, మా బ్రాండ్ ఆకాంక్షలను కూడా సూచిస్తాయని విశ్వసిస్తున్నాము!’’ అని అన్నారు.
 
చక్కగా నిర్వచించబడిన పర్సనా స్ట్రాటజీ కింద రూపొందించబడిన కొత్త హారియర్, సఫారి ఈ విభాగం అంచనాలకు మించి ఉన్నాయి. లెజండరీ వారసత్వంతో కూడిన ఈ కార్లు వారి ప్రతి కస్టమర్ వర్గానికి సరిపోయేలా పూర్తిగా తిరిగి రూపొందించబడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ నాయకులు ఈ అపరిష్కృతమైన అవసరాన్ని పరిష్కరించాలని కోరుతున్న అంజు అరోరా- దివ్య రాజేశ్వరి