Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల రిలీజ్

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (13:08 IST)
కోవిడ్ మహమ్మారి కారణంగా గత 2020 మార్చి నుంచి నిలిపివేసిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలకుగాను ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేయనుంది. 
 
ఇందులో సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదశ పాదపద్మారాధన, నిజపాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్దతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. 
 
ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రజుల పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేస్తారు. టిక్కెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత తితిదే వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తుంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లో సేవల చార్జీలకు సంబంధించిన రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.
 
ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవకు సంబంధించిన టిక్కెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే, ప్రత్యేక రోజుల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 
 
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 
 
ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments