టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడిగింపు: ఉత్తర్వుల జారీ

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:53 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శ‌నివారం ఉత్తర్వులను జారీ చేసింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ డిప్యుటేషన్‌పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా పని చేశారు.

టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు తాజాగా రెండోసారి డిప్యుటేషన్‌ను పొడిగించారు.

మరోవైపు తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా అనిల్‌కుమార్ సింఘాల్‌పై విమర్శలు గుప్పిస్తున్న విష‌యం విధిత‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments