వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:42 IST)
వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరితగతిన కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, వీఐపీ సిఫారసు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెసవి సెలవులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని తితిదే నిర్ణయించింది. 
 
శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసిన తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని కూడా ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. 
 
ఈ మార్పు మేరకు.. బ్రేక్ దర్శనం ఇకపై ఉదయం 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. తాజా నిర్ణయంతో మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలను అనుమతించరని తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments