తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఈ కారణంగా తిరుమల గిరుల్లో విపరీతమైన భక్తుల రద్దీ పెరిగిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే ప్రకటించారు. అలాగే సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోనని స్పష్టం చేసింది. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరింది.
దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానిక క్యూలైన్లలో 30 నుంచి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలను కూడా స్వీకరించోబమని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.