Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

Advertiesment
Tirumala

ఠాగూర్

, ఆదివారం, 23 మార్చి 2025 (10:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఈ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30వ తేదీన ఉగాది పర్వదిన వేడుకలు జరుగనున్నాయి. దీంతో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 
 
ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందుకు 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టంచేసింది. తెంలగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23వ తేదీన స్వీకరించి 24వ తేదీన దర్శనానికి అనుమతించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!