Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

Advertiesment
swiggy

ఠాగూర్

, ఆదివారం, 23 మార్చి 2025 (10:11 IST)
బ్రో అని సంబోధించినందుకు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ ఫ్లాట్ యజమాని భౌతికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా వైజాగ్‌లోని డెలివరీ బాయ్స్ అంతా ఏకమై ఆందోళనకు దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వైజాగ్, సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్ల్ బి బ్లాక్‌లో 29వ అంతస్తులో నివసిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అనిల్ ఫుడ్ పార్శిల్‌తో ప్రదాస్ ఇంటికి వెళ్లి, కాలింగ్ బెల్ నొక్కగానే ఓ మహిళ వచ్చింది. అయితే, అనిల్ మాటలు అర్థం కాకపోవడంతో ఇంటి యజమాని ప్రసాద్‌కు తెలియజేసింది. ప్రసాద్ బయటకు వచ్చి అడగగా అనిల్.. మీకు ఫుడ్ పార్శిల్ వచ్చింది బ్రో అని చెప్పాడు. 
 
దీంతో ఆగ్రహించిన ప్రసాద్ "సార్ అని కాకుండా బ్రో అంటావా" అంటూ డెలివరీబాయ్‌పై భౌతిక దాడికి చేశాడు. ఆపై సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అనిల్‌ను కొట్టి, బట్టలు విప్పించి అండర్‌వేర్‌‍తో గేటు బయట నిలబెట్టాడు. అంతటితో ఆగని ప్రసాద్.. డెలివరీ బాయ్‌‍తో క్షమాపణ లేఖ రాయించుకున్నాడు. 
 
ఈ అవమానాన్ని సహించలేక తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు నగర వ్యాప్తంగా సమాచారం వ్యాప్తి చెందింది. దీంతో డెలివరీ బాయ్స్ అందరూ ఆక్సిజన్ టవర్‌ వద్ద గుమికూడి నిరసన తెలిపారు. అనిల్‌పై దాడి చేసి అవమానించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడ నుంచి పెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?