Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మావోలకు షాక్ : పోలీసుల ఎదుట 60మంది మావోల లొంగుబాటు

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (10:31 IST)
ఏపీలో మావోలకు షాక్ తప్పలేదు. పోలీసుల ఎదుట 60మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు  అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందినవారు. 
 
వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలున్నారు. లొంగిపోయిన వారిలో మాజీ ఎంఎల్‌ఎలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు మరోవైపు మావోయిస్టుల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డిఐజి హరికృష్ణ, ఎస్‌పి సతీశ్ మీడియాకు తెలిపారు. ఇందులో రూ.39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు వారు వివరించారు. 
 
ముఖ్యంగా అనేక హింసాత్మక నేరాలలో చురుకుగా వ్యహరించిన మావోయిస్ట్ వంతల రామకృష్ణ లొంగిపోయాడని, అతనిపై 124 కేసులన్నాయని సతీష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments