Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాటియాలా సెంట్రల్ జైలుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Advertiesment
navjyoth singh siddhu
, శనివారం, 21 మే 2022 (09:51 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పోలీసులు పాటియాలా కేంద్ర కారాగారానికి తరలించారు. మూడు దేశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆయనకు యేడాది జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు. 
 
ఆ తర్వాత నిబంధనల మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులే సిద్ధూను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి మరికొద్ది రోజుల సమయం కావాలంటూ శుక్రవారం సిద్ధూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్‌ను సమర్పించాలని, ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. దీంతో సిద్ధూ కోర్టులోనే లొంగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాంగోంగ్ సరస్సు వద్ద రెండు వంతెనలు నిర్మించిన చైనా