Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖుల భేటీ

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (13:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలు తాజాగా మంత్రి పేర్నినానిని కలిశారు. సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. 
 
గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆల్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాల అంశంపై సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కోసం ఈ మీటింగ్‌లో చర్చ జరిగిన విషయంతెల్సిందే.
 
మంత్రితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన దిల్ రాజు మంత్రితో సమావేశంలో ప్రత్యేక విషయం ఏమి లేదని, కొన్ని వివరణలు అడిగగా, ఆ సమాచారం ఇవ్వటానికే వచ్చామని దిల్ రాజు వెల్లడించారు. మిగిలిన విషయాలు అధికారికంగా మంత్రి చెబుతారని తెలిపారు. 
 
అయితే గురువారమే సినీ హీరో నాగార్జున పలువురితో వెళ్ళి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం, ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనంతరం నాగ్, జగన్ మధ్య చర్చలు జరగడం తెలిసిందే. తర్వాత నాగార్జున కేవలం వ్యక్తిగతంగా మాత్రమే సీఎంను కలిశానని పేర్కొన్నప్పటికీ, మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments