Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్!?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ శాఖను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను నియమించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన్ను ఏపీ శాఖ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు, బీఆర్ఎస్‌లో మరికొంతమంది ఏపీ నేతలు సోమవారం చేరనున్నారు. వీరిలో చంద్రశేఖర్‌తో పాటు ఐఆర్టీఎస్ మాజీ అధికారి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టేజీ ప్రకాష్‌తో పాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వీరంతా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఆ తర్వాత ఏపీ పగ్గాలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 యేళ్లపాటు పని చేసిన ఈయన గత 2009లో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైకాపా అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నుంచి 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments