శ్రీవారి భక్తులు త్వరపడండి, దర్సనం టిక్కెట్లు పెంపు, ఎన్ని విడుదల చేశారంటే?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:27 IST)
తిరుమల శ్రీవారి దర్సన టిక్కెట్ల సంఖ్యను పెంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. అదనంగా మరో మూడు వేల టిక్కెట్లను ఆన్ లైన్లో అందిస్తోంది. ఇప్పటివరకు 6,750 టోకెన్లు మాత్రమే ఆన్ లైన్‌తో పాటు తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచింది. అయితే ఈ రోజు నుంచి 9,750 టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఆన్ లైన్లో నేటి నుంచి అదనంగా మరో మూడువేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకు అందజేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజుకు 3 వేల అదనపు కోటా 300 రూపాయల ఆన్లైన్ దర్సన టిక్కెట్లను విడుదల చేసింది టిటిడి. ప్రతి స్లాట్‌కు 250 టిక్కెట్ల చొప్పున 12 స్లాట్స్ కేటాయించింది.
 
శుక్రవారం మాత్రం 10 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది. భక్తులు తిరుపతి బాలాజీ. ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు పొందే అవకాశం ఉంది. లాక్ డౌన్ 5.0 సడలింపుల తరువాత ఈ నెల 10వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లోను, ఆన్ లైన్లోను టిక్కెట్లను అందిస్తోంది టిటిడి.
 
అయితే విడతల వారీగా భక్తుల రద్దీని పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు టిటిడి ఛైర్మన్ ప్రకటించిన విధంగానే తొమ్మిది రోజుల తరువాత మరో 3 వేల టిక్కెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది టిటిడి. ఆన్లైన్లో ఇప్పటికే టిక్కెట్లను భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. స్వామివారిని దర్సనం చేసుకోవాలనుకునే వారు తొందరపడి ఆన్ లైన్ బుక్ చేసుకోవాల్సిందేనంటున్నారు టిటిడి అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments