Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలకు పోటెత్తిన భక్తులు... 8 రాష్ట్రాల నుంచి రాక

Advertiesment
Tirumala
కరోనా లాక్డౌన్ కారణంగా గత 80 రోజులుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇపుడు అంటే 82 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం నాడు 8 రాష్ట్రాల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గురువారం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 8 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 143, తమిళనాడు 141, కర్ణాటక నుంచి 151 మందితో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.
 
దీనిపై తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటిస్తూ తిరుమల, తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-06-2020 శుక్రవారం రాశి ఫలితాలు.. ఇష్టకామేశ్వరి దేవిని?