కరోనా కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచి భక్తులను మాత్రం అనుమతించారు. వైదిక కార్యక్రమాలన్నీ యథావిథిగా కొనసాగించారు. అలాగే కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఆలయాలు మళ్ళీ తెరుచుకున్నాయి.
తిరుమలలో మాత్రం 8,9 తేదీల్లో టిటిడి ఉద్యోగస్తులను దర్సనానికి అనుమతించారు. 10వ తేదీ తిరుమల స్థానికులను భక్తులను పంపించారు. ట్రయర్ రన్ సక్సెస్ కావడంతో ఇక సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
అయితే ఈ మూడురోజుల ట్రయల్ రన్లో టిటిడి అనుకున్న దానికన్నా ఎక్కువమందే స్వామివారిని దర్సించుకున్నారు. 21,500 మంది టిటిడి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు, స్థానికులు స్వామివారిని దర్సించుకుంటే 33,500 మందికి లడ్డూప్రసాదాలను అందజేశారు. ఇక తలనీలాలు 1508 మంది సమర్పించారు. అన్నప్రసాదాలను 31 వేల మంది స్వీకరించారు. రెండు రోజుల్లో హుండీ ఆదాయం 47 లక్షల రూపాయలు వచ్చింది.