Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ ప్రేమ.. వివాహితను వాడుకునే వరకు వచ్చింది..పెళ్లి అనేసరికి?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (11:13 IST)
సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ప్రేమించుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంతవరకు ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా ప్రేమాయణాలు చిగురించేవి. ప్రస్తుతం సీన్ టిక్ టాక్ వరకు వచ్చింది. తాజాగా ఓ టిక్ టాక్ ప్రేమ కథ మోసానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. తాను పెడుతున్న వీడియోలను తెగ లైక్ చేస్తున్న ఓ వ్యక్తిని ప్రేమించిన వివాహిత యువతి దారుణంగా మోసపోయింది. 
 
హైదరాబాదులో భర్తతో విభేదాలు తలెత్తడంతో అతనికి దూరంగా వుంది. ఆ వివాహిత, టిక్ టాక్ యాప్‌లో వీడియోలను అప్ లోడ్ చేస్తుండగా, ఓ వ్యక్తి ఆమె హావభావాలకు లైక్‌లు కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్న ఆ వ్యక్తి ప్రేమ, పెళ్లి అంటూ ఆమెను నమ్మించాడు. 
 
చివరికి పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించింది. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని, అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను వాడుకున్నాడని.. ఇప్పుడు మొహం చాటేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments