వైసిపీలో వైఎస్సార్ లేరు, జగన్ పార్టీని ఏపీ ప్రజలు గోతిలో పాతేశారు: వైఎస్ షర్మిల (video)

ఐవీఆర్
శుక్రవారం, 12 జులై 2024 (22:17 IST)
వైసిపిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ... ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు అంటూ చెప్పారు ఏపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడిచిన వైసిపిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గోతిలో పాతేశారని సంచలన వ్యాఖ్యలు చేసారు. కనుక వైసిపిలో వైఎస్సార్ లేరని మరోసారి గట్టిగా చెబుతున్నా అంటూ వెల్లడించారు షర్మిల.
 
ఆమె మాట్లాడుతూ..  ''వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ... వైసీపీకి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే హెచ్చరిక. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదు. మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తా. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని హెచ్చరిస్తున్నాను.'' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments