Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (08:42 IST)
లోక్ సభలో బుధవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి ప్రశ్నించారు. గత 50 రోజులుగా కర్నూలు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న విషయాన్ని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు  తెలిపారు.

వారి ఆకాంక్షల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు. దానికి కేంద్ర న్యాయశాఖ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా  జవాబిస్తూ ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ప్రతిపాదిస్తోందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో  2019 జనవరి 1న హైకోర్టు ఏర్పాటు అయిందని తెలిపారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైకోర్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments