Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు రోజుల్లో తేల్చేయండి.. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రెండు రోజుల్లో తేల్చేయండి.. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
, బుధవారం, 16 అక్టోబరు 2019 (08:24 IST)
ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని, అలాగే కార్మికులు కూడా పట్టుదలకు పోకుండా సమ్మె విరమించాలని హైకోర్టు సూచించింది..

రెండు రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి కావాలని, 18వ తేదిన జరిగే విచారణలో అన్ని వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఈరోజు ఇరువర్గాల వాదనలు హైకోర్టులో సాగాయి… ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.

ప్రభుత్వం – యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు తెలపడానికి అనేక మార్గాలున్నాయంటూ తెలిపింది. ఆఖరి అస్త్రం ఉపయోగించినా ఫలితం లేదుకదా అని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు స్పష్టం చేశారు.

ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పోరేషన్లు ముందుకొస్తాయని తెలిపింది. కార్మికుల సమ్మె ప్రజలపై పడకుంగా 6 వేల బస్సులను నడుపుతున్నామని కోర్టుకు తెలిపింది. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టీసీ సమ్మె వలన ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.  ప్రమాదాలపై హైకోర్టు స్పందిస్తూ, ఇప్పటికిప్పుడు శిక్షణ పొందిన డ్రైవర్లు ఎలా దొరుకుతారని ప్రశ్నించింది. మొత్తం 10 వేల బస్సులలో 6 వేల బస్సులు నడిపిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు..

అయితే ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం  హైకోర్టు వ్యక్తం చేసింది. యూనియన్ తరపు నుంచి దేశాయక్ ప్రకాశ్ వాదనలు వినిపించారు. కార్మికుల సమస్యలపై 30 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్లడం జరిగిందని చెప్పారు.

సమస్యలపై అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సమ్మె అనేది కార్మికులకు ఉన్న ఆఖరి అస్త్రమని యూనియన్ తెలిపింది. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని యూనియన్ చెప్పింది. ఆర్టీసీ సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేరని..సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని యూనియన్లు వాపోయాయి.

దీనిపై స్పందించిన హైకోర్టు వెంటనే ఆర్టీసీకి ఎండిని నియమించాలని ఆదేశించింది.. ప్రభుత్వమ్ ఈ నిమిషం నుంచే చర్చలు ప్రారంభించాలని సూచించింది హై కోర్ట్.. అలాగే కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరింది.. ఈ నిమిషం నుండే చర్చను ప్రారంభించి రెండు రోజుల్లో కు కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.. 18 లోపు శుభవార్త చెప్పాలని హై కోర్టు కోరింది. ఆ రోజు వరకూ విచారణను వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలిఫోర్నియాలో బాహుబలి గుమ్మడి