Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నెలలకు సీఆర్టీ టీచర్ల సేవలు, సెలవు కాలంలోనూ అందనున్న వేతనాలు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (18:16 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీల) పని కాలాన్ని ఈ విద్యాసంవత్సరానికి 12 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
 
గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వారి సేవలను పరిగణలోకి తీసుకుంటూ ఆమేరకే  వేతనాలను కూడా చెల్లించడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేదివరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని చెప్పారు.
 
ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు. అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలని, ఏడాదిలో 10 రోజులుమినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా తమ పని దినాలుగా గుర్తించాలని సీఆర్టీలు చేసిన విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని 2020-21 విద్యా సంవత్సరానికి గాను పది రోజులు మినహా మిగిలిన మొత్తం 12 నెలల కాలాన్ని కూడా వారికి పని దినాలుగానే పరిగణిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పుష్ప శ్రీవాణి వివరించారు.
 
ఈ మేరకు వారికి సంబంధించిన వేతనాలను కూడా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కాగా తమ విన్నపాన్ని మన్నించి తమ సర్వీసు కాలాన్ని ఈ విద్యాసంవత్సరంలో పది రోజులు మినహా 12 నెలలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments