Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి సమానుడే కామాంధుడయ్యాడు.. గర్భందాల్చినా వదల్లేదు...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (12:27 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి కామాంధుడిగా మారిపోయాడు. ఆ యువతి గర్భందాల్చినా వదిలిపెట్టలేదు. శారీరకంగా హింసించడమేకాకుండా అత్యాచారం జరిపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ ఓ బిడ్డ పుట్టిన తర్వాత భర్తను విడిచి కావలికి చెందిన ఓ వ్యక్తితో వెళ్లిపోయింది. అతనితో సహజీవనం చేస్తూ వచ్చింది. తన కుమార్తె పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి చూపులు ఆమె కూతురుపై పడ్డాయి. పెద్ద మనిషి అయిన కొన్నాళ్లకే ఆ యువతిని శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. 
 
భార్యలేని సమయంలో బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు మాత్రలు మింగించి గర్భాన్ని కూడా తీయించాడు. పైగా, ఈ విషయాలు బయటకు చెబితే యువతితో పాటు ఆమె తల్లిని కూడా చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు.
 
ఈపరిస్థితుల్లో ఆ కామాంధుడి వేధింపులు భరించలేకపోయింది. దీంతో అతని నుంచి తప్పించుకొని బయటకు వెళ్లిపోయింది. అయితే, తన పలుకుబడిని ఉపయోగించి ఆ యువతిని గాలించి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి రాడ్లతో కొట్టి హింసించాడు. ఈ విషయం కన్నతల్లికి చెప్పి బోరున విలపించింది. 
 
తల్లి తాను సహజీవనం చేస్తున్న వ్యక్తిని కుమార్తె విషయంపై ప్రశ్నించింది. అతడు ఆ ఇద్దరిని గృహనిర్భంధం చేశాడు. అయితే ఈ నెల 18వ తేదీన తల్లీకూతుళ్లు ఆ ఇంటి నుంచి తప్పించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ధైర్యం చాలక ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తండ్రిగాని తండ్రి అయిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని ఆ యువతి గ్రీవెన్స్‌ అధికారులను వేడుకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments