Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో ప‌క్క‌సీటులో ఆమెతో అస‌భ్యంగా....

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:15 IST)
ఫ్లైట్లో ప‌క్క సీటు ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి... చివ‌రికి గ‌న్న‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌కు చేరిన ఓ ప్ర‌భుద్దుడి క‌థ ఇది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన కుమ్మ‌రి ల‌క్ష్మ‌ణ్ మ‌స్క‌ట్ నుంచి హైద‌రాబాదుకు వ‌స్తున్నాడు. చాలా ఏళ్ళ త‌ర్వాత స్వ‌స్థ‌లానికి వ‌స్తున్నల‌క్ష్మ‌ణ్... త‌న మానాన తాను ఫ్ల‌యిట్లో కూర్చోకుండా... ప‌క్క సీట్లో ఉన్న మ‌హిళ‌ను అసభ్యంగా తాకాడు. అంతే... కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేష‌న్ పాల‌య్యాడు. 
 
గన్నవరం విమానాశ్రయానికి మస్కట్ నుండి వయా  గన్నవరం మీదుగా హైదరాబాద్ విమానాశ్రయం వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన మహిళను అదే విమానంలో ప్రయాణం చేస్తున్నపక్క సీట్లో కూర్చున్న లక్ష్మణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శ‌రీర భాగాల‌ను తాకుతూ, శారీరకంగా కూడా హింసించ‌డంతో బాధిత‌ మ‌హిళ గన్నవరం విమానాశ్రయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ల‌క్ష్మ‌ణ్‌ను విమానం నుంచి అర్ధంత‌రంగా దించేశారు.

బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడు ల‌క్ష్మ‌ణ్‌ని ఎయిర్పోర్ట్ అధికారులు గన్నవరం పోలీసులకు అప్పగించారు. నిందితుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఇపుడు గన్నవరం పోలీస్ స్టేష‌న్లో కేసు నమోదు...కాగా, ల‌క్ష్మ‌ణ్‌ని పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments