Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"నారప్ప" రివ్యూ రిపోర్ట్.. వెంకీ నటన అదుర్స్.. కానీ..?

webdunia
మంగళవారం, 20 జులై 2021 (10:31 IST)
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "నారప్ప". తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పామ్ అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. 
 
ఈ 'నారప్ప' చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్, వీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. వెంకటేశ్ అన్న సురేశ్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరించారు. వెట్రిమారన్ కథ రచించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. శ్యామ్ కె. నాయుడు సినిమాగ్రఫీ చేశారు. మార్తాండ్ కె. వెంకటేశ్ ఈ మూవీకి ఎడిటర్‌గా వ్యహరించారు.
 
నిజానికి వెంకటేశ్ 'నారప్ప' 2020 మేలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ఈ మూవీని విడుదల చేశారు. టీజర్, ట్రైలర్, వెంకటేశ్ పిక్స్, పోస్టర్స్‌కు మంచి స్పందన కనిపించింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా విడుదలతో అంచనాలకు మించి ఉందని ప్రేక్షకులు, సినిమా వర్గాలు అంటున్నాయి. 
 
వెంకటేశ్ రైతు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెబుతున్నారు. వెంకీ డైలాగ్స్, స్టైల్, మేనరిజమ్, లుక్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలిచాయని అంటున్నారు. ఇక హీరోయిన్ ప్రియమణి సుందరమ్మగా మెప్పించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా వెంకటేశ్ నటన అదిరిపోయిందని రివ్యూ టాక్ వచ్చింది. 
 
ఇక కథలోకి వెళ్తే.. 
అనంతపురం జిల్లా రామసాగరంలో వెంకటేశ్ కుటుంబం వ్యసాయం చేసుకుంటుంది. పక్క గ్రామానికి చెందిన భూస్వామి పండుస్వామితో వెంకటేశ్‌కు భూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ తగాదాల్లో వెంకటేశ్ కొడుకు హత్యకు గురవుతాడు. 
 
వెంకటేశ్‌కు చెందిన మూడెకరాల పొలాన్ని పండుస్వామి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పండు స్వామి కుట్రలను వెంకటేశ్ పెద్ద కొడుకు మునిఖన్నా(కార్తిక్ రత్నం) తిప్పుకొడతారు. ఈ విషయమై ఒక సదర్భంలో పండుస్వామిని మునిఖన్నా చెప్పుతో కొడతాడు. దీంతో అవమానంగా ఫీలై మునిఖన్నాపై పండుస్వామి పగ పెంచుకుంటారు. పథకం ప్రకారం తన మనుషులతో మునిఖన్నాను పండుస్వామి చంపిస్తాడు.
 
దీంతో పండుస్వామిపై వెంకటేశ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారోనని అనుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా మేస్సేజ్ ఓరియంటెడ్‌గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈమూవీని తీర్చిదిద్దాడు. ఇక సినిమాలోకి వస్తే వెంకటేశ్ రైతు పాత్రలో ఒదిగిపోయారు. తన పెద్ద కుమారుడి హత్య తర్వాత మరిచిపోయి తన పని తాను చేసుకుంటుంటారు. ఈ సమయంలో గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్ వెంకటేశ్ నటనను మరో రేంజ్‌కి తీసుకువెళ్లింది.
 
అయితే తల్లి ప్రియమణి మాత్రం కొడుకు హత్యను మర్చిపోలేక వేదన పడుతుంటారు. తల్లి వేదనను చూడలేక, అన్న హత్యను జీర్ణించుకోలేదని వెంకటేశ్ చిన్న కొడుకు సిన్నప్ప (రాఖీ).. పండుస్వామిపై పగతో రగలిపోతాడు. చివరకు పండుస్వామిని చంపేస్తాడు..
 
సినిమా ఇక్కడి నుంచే అధ్యాత్యం రక్తి కట్టిస్తుంది. పండు స్వామిని చిన్న కొడుకు చంపడంతో వెంకటేశ్ (నారప్ప) కుటుంబం గ్రామం వదిలివెళ్లిపోతుంది. చిన్న కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు వెంకటేశ్ చేసిన ప్రయత్నం ఏంటి?. పెద్ద కొడుకును చంపితే సహనం కోల్పోని వెంకటేశ్ చిన్న కొడుకు విషయంలో చివరకు ఏం చేశాడనే ది ఈ సినిమాను మలుపుతిప్పుతుంది.
 
ప్లస్ పాయింట్స్.. 
కథ
వెంకటేష్‌తో పాటు నటీనటుల నటన
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 
మైనస్ పాయింట్స్ 
తెలుగు నేటివిటికి తగ్గట్టు లేకపోవడం
నేరేషన్ స్లోగా సాగడం
గతంలో చూసిన కొన్ని సినిమాలు గుర్తుకు రావడం
 
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

హ్యాపీ బర్త్‌డే టు కొణిదెల ఉపాసన