Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాలామంది ఇక ఏడ్చింది చాలుర్రా బాబూ అన్నారుః వెంక‌టేష్‌

చాలామంది ఇక ఏడ్చింది చాలుర్రా బాబూ అన్నారుః వెంక‌టేష్‌
, శనివారం, 17 జులై 2021 (16:41 IST)
Venkatesh ph
హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. ఈయ‌న‌తో మాట్లాడుతుంటే వ‌ర్త‌మానమే ముందుంటుండి. గ‌డిపోయింది, జ‌ర‌గోయేది ఏదీ మ‌న‌కు క‌నిపించ‌దు. అదేమని అడిగితే బి పాజిటివ్‌. అంటూ ఆథ్యాత్మిక వేత్త‌గా మాట్లాడ‌తారు. ఆయ‌న కొత్త‌గా న‌టించిన సినిమా `నార‌ప్ప‌`. త‌మిళంలో ధ‌నుష్ చేసిన `అసుర‌న్‌`కు రీమేక్‌. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం పలు కారణాల చేత ఈనెల 20న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధంగా ఉంది. శ‌నివారంనాడు ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.
ఓటీటీ మాధ్య‌మం వ‌చ్చాక అసుర‌న్ సినిమాను చాలామంది చూసేశారు. మ‌రి నార‌ప్ప విడుద‌లకు ఆ ప్ర‌భావం వుంటుందా?
మారిన కాలంబ‌ట్టి ఓటీటీ వ‌చ్చింది. చాలామంది చూసేవుంటారు. ఓటీటీకి అల‌వాటు ప‌డ్డారు కూడా. కానీ ఎంత‌మంది అసుర‌న్ చూశార‌నేది నాకైతే తెలీదు. అయినా ఈ సినిమాను చూసేవారు చూస్తారు. చూద్దాం ఎలా వుంటుందో. గుడ్ ఫిలిం చేయ‌డ‌మే నా పాల‌సీ. బిజినెస్ సైడ్ చాలా మంది ఇన్‌వాల్వ్ అయివుంటారు. థియేట‌ర్లో చేయాలా, ఓటీటీలో చేయాల‌నేది మ‌న చేతుల్లో లేదు.
మీరు బాగా ఇన్‌వాల్వ్ అయిన సీన్స్ నార‌ప్ప‌లో ఏమున్నాయి?
నార‌ప్ప ఫ్యామిలీలోని విషాద‌మే ఇన్‌వాల్వ్‌మెంట్‌. ఎమోష‌న్స్ బాగా చేశాను. దానికోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. అదేవిధంగా యాక్ష‌న్ సీక్వెన్స్‌కూడా ఇంత‌కుముందు చేయ‌ని విధంగా చేశాను. ప్ర‌తి షాట్ త‌ర్వాత ఎమోష‌న్స్ బాగా క‌నెక్ట్ అయ్యాను. యాక్ష‌న్ మాత్రం చాలా ట‌ఫ్‌గా అనిపించింది. 50 రోజులు అదే కాస్ట్యూమ్ తో హోటల్ రూమ్ లో ఉన్నాను.
 
పాండ‌మిక్‌లో మీలో ఏమైనా మార్పు క‌నిపించిందా?
ప్ర‌కృతి మ‌నంద‌రికీ ఓ పాఠం నేర్పింది. మ‌న‌లో అంత‌ర్‌శ‌క్తిని పెంచుకోవాలి. బి సైలెంట్‌. మెడిటేష‌న్ ఎక్కువ‌గా చేయాలి. దేనికోస‌మూ ప‌రుగెత్త‌కూడ‌దు. పొద్దున్నే నిద్ర‌లేచామా,  ఓ ప‌దినిముషాలు పాటు ఈ విశ్వానికి, లేదా మీర‌నుకునే దేవుడికి కృత‌జ్ఞ‌త చెప్పాలి. వండ‌ర్స్ చూస్తారు. నెగెటివ్ ఆలోచ‌న‌లు, నెగెటివ్ మ‌నుషుల‌ను క‌ట్ చేయాలి.
 
మీరు కంట‌త‌డిపెడితే సినిమా హిట్ అనే టాక్ వుంది? మ‌రి నార‌ప్ప‌లో వుందా?
ఎమోష‌న‌ల్ సీన్ బాగుంటే ఆటోమేటిక్ గా అదే వ‌స్తుంది. నేను మొద‌ట్లో ఏడుస్తుంటే.. `ఆప‌రా బాబూ..అనేవారు. సీన్ బాగుందిక‌దా చేస్తే ఏమిట‌ని అడిగేవాడిని. ఓసారి ఔట్‌డోర్ వుంటే చాలామంది అరిచారు. అదేదో బ‌య‌ట కాదు. కెమెరాముందు ఏడ‌వండి అని కామెంట్లు వ‌చ్చాయి. `ప్రేమ‌, ధ‌ర్మ‌చ‌క్రం` సినిమాల‌లో అనుకుంట‌, ద‌ర్శ‌కుడు సురేష్‌కృష్ణ‌కు కెమెరా నా మొహం ద‌గ్గ‌ర పెట్ట‌మ‌ని చెప్పాను. అమ్మాయి చ‌నిపోయాక రైల్వే స్టేష‌న్‌లో సీన్ ఏడ్చేశాను. కెమెరాముందు నిజంగానే ఏడ్చేశాను. ల‌క్కీగా పండింది. ఆ త‌ర్వాత న‌న్ను అలా ఏడిపించేశారు.
 
‘నారప్ప’ సినిమా చెయ్యడానికి మీకు ఏ అంశం బాగా నచ్చింది?
మొదటిగా నేను ధనుష్, కి వెట్రిమారన్ కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది నాకే ఛాలెంజింగ్ గా ఉంటుంది అనిపించింది. అందుకే నా కెరీర్ రీమేక్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. అందరూ అదే అడుగుతారు ఎందుకు రీమేక్ సినిమాలు ఎక్కువ అని. నేనేమి కావాలని చెయ్యను అలా జరుగుతుంది అంతే. అలా అని రీమేక్స్ చెయ్యడం అనేది చిన్న విషయం కూడా కాదు ఆల్రెడీ హిట్టయిన సినిమాని వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మళ్ళీ హిట్టయ్యేలా చెయ్యడం అనేది చాలా రిస్క్ తో కూడుకుంది. అందుకే నేను చేస్తా.
 
ఒరిజినల్ కి ‘నారప్ప’ కి కంపేరిజన్స్ ఏమన్నా ఉన్నాయా?
ఖచ్చితంగా, ఏ రీమేక్ సినిమాకి అయినా పోలిక‌ అనేది ఉంటుంది. నా సినిమాలు సుందరాకాండ, చంటి సినిమాల నుంచే చాలానే మార్పులు ఉంటాయి. అలాగే నారప్ప కి కూడా కావాల్సిన చేంజెస్ చాలానే చేసాం. 
 
త‌రుణ్‌భాస్క‌ర్‌, త్రివిక్ర‌మ్ సినిమా వున్నాయంటున్నారు. నిజ‌మేనా?
స్పోర్ట్స్ డ్రామా గురించి త‌రుణ్‌భాస్క‌ర్‌తో క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు ఎఫ్‌3 చేస్తున్నా. ఆ త‌ర్వాత నేను ఏమి చేస్తాన‌నేది చెప్ప‌లేను. క‌థ‌లు ఇంకా రావాలి. ఏదిఏమైనా కాంబినేష‌న్‌లు, వందవ సినిమా అనే నెంబ‌రింగ్ అనేవి నేను ఆలోచించ‌ను. పొద్దునే లేచి ప‌నిచేయ‌డ‌మే. మ‌న చేతిలో వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా జీవితం తలుచుకుంటేనే కష్టాలపాలు, కన్నీళ్ళు పెట్టుకున్న అమలాపాల్