Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెటిరోకు జగన్ సర్కార్ భారీ గిఫ్ట్ : కేసు పెట్టలేదుకదా భూములు అప్పగింత

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:22 IST)
విశాఖపట్టణం జిల్లా నక్కపల్లిలోవున్న హెటిరో డ్రగ్స్‌ ఫార్మా కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ బహుమతి ఇచ్చింది. ఎకరం రూ.50 లక్షలు పలుకుతున్న నక్కపల్లి ప్రాంతంలో అతి కారు చౌకగా అంటే కేవలం సగం ధరకే విక్రయించింది. ఇలా ఏకంగా 81 ఎకరాల భూములను అప్పనంగా అప్పగించింది. ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
విశాఖ బీచ్‌రోడ్డులోని బేపార్కును ఏడెనిమిది నెలలక్రితం హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసినట్టు అప్పట్లో చెప్పుకొన్నారు. త్వరలో విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి నివాసం కోసమే బేపార్కు లావాదేవీ నడిచినట్టు అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. 
 
ఇందుకు ప్రతిఫలంగానే క్విడ్‌ ప్రొ కో విధానంలో అతి తక్కువ ధరకు హెటిరోకు 81 ఎకరాలు ఇచ్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం హెటిరోకు భూములు కేటాయిస్తూ....ఆమోదముద్రవేసింది. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ తన పరిసర గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, శ్మశానాలను ఆక్రమించుకుంది. 
 
ఆ మేరకు కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా... వారికే తక్కువ ధరకు వాటిని ప్రభుత్వం ధారాదత్తం చేయాలని నిర్ణయించడం ఒక విచిత్రమైతే.. బహిరంగ మార్కెట్‌ రేటుతో పోల్చితే సగం ధరకే కేవలం రూ.25 లక్షల చొప్పున హెటిరోకు ఈ భూములు ఇవ్వాలని నిర్ణయించడం మరింత విడ్డూరం. ఈ భూములన్నీ జాతీయరహదారిని ఆనుకుని వుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments