Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సర్కారు కీలక నిర్ణయం : విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ఏపీ సర్కారు కీలక నిర్ణయం : విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
, బుధవారం, 30 జూన్ 2021 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
అలాగే, నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమానికి ప‌చ్చ‌జెండా ఊపింది. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. 
 
జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి మంత్రివ‌ర్గం అంగీక‌రించింది. 
 
2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూముల‌ రీసర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌ సెజ్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీలకు కరోనా వ్యాక్సినేషన్ : కేంద్రం మార్గదర్శకాలు ఇవే..