Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందో రోజుకు రాజధాని రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (19:16 IST)
రాజధాని రైతుల ఉద్యమం వందో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాజధానిగా అమరావతి కొనసాగాలన్న రైతుల ఆకాంక్షను గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కూడా రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కరోనా నిరోధానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

కరోనా నిరోధానికి ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ దేశం కోసం పోరాడుతున్న విధంగానే అమరావతి కోనం ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
 
అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులని అవమానించినా.. లాఠీ దెబ్బలు కొట్టినా రాజధాని గ్రామాల ప్రజలు సహనం కోల్పోదని కొనియాడారు.

‘‘జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులని అవమానించినా, లాఠీ దెబ్బలు కొట్టినా... వేల మందిని జైలుకి పంపినా సహనం కోల్పోలేదన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన రైతులు, మహిళలకి ఉద్యమ వందనాలు’’ అని లోకేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments